*మేము 75 లక్షలిచ్చాం.. మీరో కోటి ఇవ్వండి*
*"ఎమ్మెల్యే శంకర్" కు లింగారెడ్డి గూడ ఎంపీటీసీ భీశ్వ రామకృష్ణ సూచన*
*"వంకర టింకర" మోరీ వేసింది మీ పార్టీ సర్పంచన్న విషయం మరవద్దు*
*మా ఊరి కాంగ్రెస్ నాయకులు మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు*
*డ్రైనేజీ పనులు సజావుగా జరిగేటట్టు చూడండని ఎంపీటీసీ భీష్వరామకృష్ణ వినతి*
*గ్రామంలో ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో చర్చకు రండి వాస్తవాలు చెబుతాం రండి*
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషితో గ్రామంలో 75 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో డ్రైనేజీ కాలువ నిర్మాణం పనులు చేపడితే లింగారెడ్డి గూడ గ్రామ కాంగ్రెస్ నాయకులు వాటిని రాజకీయం కోసం అడ్డుకున్నారని, గ్రామంలో వంకర టింకర పనులు చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అన్న విషయాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రహించాలని గ్రామ ఎంపీటీసీ భీష్మ రామకృష్ణ సూచించారు.
లింగారెడ్డి గూడ గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య వివాదాస్పదంగా మారిన డ్రైనేజీ కాలువ నిర్మాణం పనుల వ్యవహారంలో శనివారం గ్రామ ఎంపీటీసీ రామకృష్ణ తదితర గ్రామస్తులు కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితిని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా భీష్మ రామకృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హయాంలో ఎస్డిఎఫ్ 75 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో మురికి కాలువ డ్రైనేజీ పనులను చేపట్టామని తెలిపారు. ఈ పనులు ఇటీవల కాలంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు నిలిపివేశారని ఆరోపించారు. గ్రామంలో ఈ నిర్మాణం పనులు ఆపడం వల్ల వర్షాలు వచ్చిన సమయంలో ఇతర సమయాల్లో స్థానిక ప్రజలు ఆ కాలువ పొడవున నివసించే స్థానికులు దుర్గంధం, వర్షపునీరు, మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చామని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే శంకర్ గ్రామాన్ని సందర్శించడం మంచి పరిణామం అని అన్నారు. ఈ సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఇతరులను అభాసుపాలు చేసే విధంగా మాట్లాడడం బాధ కలిగించిందని భీశ్వ రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు అసలు ఈ పనుల గురించి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. 75 లక్షల రూపాయలతో మంజూరైన ఈ పనుల గురించి తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని దీని పొడవు వెడల్పు ఎంతో మాకు తెలుసని కాంగ్రెస్ నాయకులకు దీని గురించి అసలు ఏం తెలుసు? అని మాట్లాడుతున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామంలో మురికి కాలువను వంకర టింకరగా మలిచింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి సతీమణి మమత సర్పంచుగా ఉన్న హయాంలోనే ఇది జరిగిందని పేర్కొన్నారు. సక్కగా పొడవుగా ఉన్న కాలువను తన స్వలాభం కోసం వంకర టింకరగా మార్చారని రామకృష్ణ ఆరోపించారు. తనకున్న భూమికి రహదారి లేకపోవడంతో ఇతరుల వద్ద రహదారి తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా తనకు కాలువ అడ్డు రాకుండా వంకరటింకరగా తిప్పారన్న విషయం ఎమ్మెల్యే గ్రహించాలని రామకృష్ణ సూచించారు. గ్రామ కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి స్వార్థం కోసం కాలువను వంకర టింకరగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ స్వార్థం కోసం గ్రామంలో తమను అభానుసు పాలు చేసే విధంగా ఎమ్మెల్యే శంకర్ వీటిని తెలుసుకోకుండా మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా అంజయ్య ఉన్నప్పుడు 75 లక్షలు ఇచ్చారని ఎమ్మెల్యే శంకర్ కూడా కోటి రూపాయలు లేక రెండు కోట్లు ఇస్తే తామే సన్మానం చేసి గ్రామ అభివృద్ధి కోసం అభినందిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు. తమపై నిందారోపణలు చేస్తు మసి పూసి మారేడు కాయ చేస్తున్న కాంగ్రెస్ నాయకుల వ్యవహార తీరును గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు. ఏ సర్పంచ్ హయంలో ఎంత అభివృద్ధి జరిగిందో గ్రామస్తుల సమక్షంలో తేల్చుకునేందుకు తన సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు
కాటి మల్లేష్, గొల్లు రామచంద్రయ్య గోదా లక్ష్మయ్య పోచయ్య యాదయ్య చందు యాదవ్ లక్ష్మయ్య జగన్ శ్రీశైలం అశోక్ శశాంక్ షరీఫ్, కావలి అంజయ్య, భార్దాన అంజయ్య యాదయ్య నాగభూషణం అత్యం మల్లేష్, చీపిరి కృష్ణ తిమ్మాపురం అంజయ్య గోదా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు..