రైల్వేలైన్ పై బ్రిడ్జ్ నిర్మాణం కోసం రంగం సిద్ధం

 రైల్వేలైన్ పై బ్రిడ్జ్ నిర్మాణం కోసం రంగం సిద్ధం



మున్సిపాలిటి పరిధిలోని సిగ్నల్గడ్డవద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులకు రంగం సిద్దమైంది. బ్రిడ్జ్ కోసం అటు ఇటు వాల్స్ నిర్మాణం చేసి సిద్దంగా ఉంచారు. ఆ వాల్స్పై స్టీల్ గడ్డర్లను అమర్చాల్సి ఉంది. దానిపై స్లాబ్ వేయాల్సి ఉంటుంది. రైల్వేలైన్ పై గడ్డను బిగించే క్రమంలో రైల్వే రాకపోకలు నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో దక్షిణమధ్య రైల్వేశాఖ ఇన్నాళ్లకు సమయం కేటాయించింది. మంగళవారం నుంచి 5రోజుల పాటు గడ్డర్లను బిగించేందుకు అనుమతులు జారి చేసింది. ఉదయం 11 గంటల నుంచి 3గంటల పాటు రైల్వే రాకపోకలు లేకపోవటం, ఉన్న ఒకటి రెండు రైళ్ల సమయాల్లో మార్పులు చేసి బ్లాక్ బైంగా కేటాయించి అనుమతులు ఇచ్చారు. ఆ సమయంలోనే కాంట్రాక్టరు గడ్డర్లను సిమెంట్వాల్స్పై బిగించాల్సి ఉంటుంది. బ్రిడ్జ్లపై 5గడ్డర్లు బిగించాల్సి ఉంది. రోజు ఒకటి చొప్పున 5రోజుల పాటు వాటిని బిగించేందుకు అంతా సిద్ధం చేశారు. గడ్డర్లను బిగించేందుకు 2భారీ క్రేన్లు (ఒక్కోటి 300టన్నుల సామార్థ్యం గలవి), 1 హైడ్రాలిక్ క్రేన్లను తీసుకువచ్చారు. వాటిని ఇప్పటికే బ్రిడ్జ్ పక్కన సిద్దం చేసి ఉంచారు. పక్కనే రి స్టీల్ గడ్డర్లు అందుబాటులో ఉంచారు. వాటిని భారీ క్రేస్ల సహయంతో నిర్ణీత సమయంలో బిగించేందుకు 10మంది నిపుణులు రానున్నారు. వారి సమక్షంలోనే పసులు కొనసాగనున్నాయి. అదే విదంగా జాతీయరహదారుల శాఖ అధికారులు, రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ సిబ్బంధి సైతం పనులను పర్యవేక్షించనున్నారు.
Previous Post Next Post

Education

  1. TG DOST తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...! - New!

News

  1. TG SSC Results 2025 : నేడు తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి - New!

نموذج الاتصال