మార్చి 2న బల్మూరుకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రాక


 

ఇటీవల వివాహ బంధంతో ఏకమైన ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మార్చి 02న నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలానికి రానున్నట్లు సమాచారం.

అచ్చంపేట : ఇటీవల వివాహ బంధంతో ఏకమైన ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మార్చి 02న నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలానికి రానున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులకి సొంత ఊరు బల్మూరు మండలం కావడంతో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వివాహ సంబరాలు ఆరంభం సందర్భంగా తుమ్మంపేటలో ఉన్న ఫామ్ హౌస్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇటీవలే వివాహ తంతు ముగిసిన అనంతరం నూతన దంపతులు ఫామ్ హౌస్ కు రానున్నారు. ఈ సందర్భంగా సొంత మండలంలో బంధువులు, మిత్రులు, అభిమానుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ, సినీ, తదితర రంగాల ప్రముఖులు  హాజరుకానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంద‌ని అచ్చంపేట సీఐ నాగరాజు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow