డి.ఎస్.పి వెంకటేశ్వర్లు వాహనానికి ప్రమాదం

 *సీఎం బందోబస్తులో ఉన్న డిఎస్పీ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ*

*-డీఎస్పీ వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలు డ్రైవర్ రంగారెడ్డికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు*



*-జడ్చర్ల మండలం గంగాపురం వద్ద ఘటన*

, జడ్చర్ల 

సీఎం బందోబస్తులో ఉన్న డిఎస్పి వెంకటేశ్వర్లు వాహనాన్ని లారీ ఎదురుగా బలంగా ఢీకొనడంతో డిఎస్పీ తో పాటు డిఎస్పి పోలీస్ వాహన డ్రైవర్ రంగారెడ్డి కు తీవ్ర గాయాలైన ఘటన గురువారం రాత్రి జడ్చర్ల మండల పరిధిలోని గంగాపురం గ్రామం స్టేజి వద్ద చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయదశమి పండుగ సంబరాల్లో పాల్గొనడానికి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామం లో విజయదశమి వేడుకలు ముగించుకొని బై రోడ్డు జడ్చర్ల మీదుగా కొడంగల్ వెళ్తున్నారు ఏ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా డిఎస్పి వెంకటేశ్వర్లు ఉదయం నుండి సీఎం బందోబస్తులో రూట్ మ్యాప్ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గురువారం రాత్రి గంగాపురం గ్రామ స్టేజ్ వద్ద జడ్చర్ల వైపు నుండి ఎదురుగా వచ్చిన లారీ డిఎస్పి వాహనాన్ని బలంగా ఢీకొంది దీంతో డిఎస్పి వాహనంలోని బెలూన్ లు ఓపెన్ కావడంతో డిఎస్పి వెంకటేశ్వర్లు తలకు కాళ్లకు చేతులకు స్వల్ప గాయాలు అవ్వగా వాహన డ్రైవర్ రంగారెడ్డి కు తీవ్ర గాయాలు అయ్యాయి గన్మెన్ కు స్వల్ప గాయాలు అవడంతో తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి డిఎస్పి వెంకటేశ్వర్లను స్థానికులు బందోబస్తులో ఉన్న పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు అరగంట క్రితం జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన రావణ దహన వేడుకల్లో పాల్గొన్న డి.ఎస్.పి అంతలోని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు అన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఆందోళనకు గురయ్యారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow