జడ్చర్ల: అప్పటివరకు ఆనందంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో విజయదశమి
పండుగను సరదాగా గడుపుకున్న వ్యక్తి ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు బంధువులు సన్నిహితులను శోకసంద్రంలో ఉంచిన ఘటన జడ్చర్ల పట్టణంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణానికి చెందిన రవి యాదవ్(47) విజయదశమి పండుగ సందర్భంగా తన బంధువులకు సన్నిహితులను జమ్మి ఆకు పెట్టేందుకు ఇంటి నుండి బయలుదేరాడు. ఈ క్రమంలోనే పట్టణంలోని నేతాజీ చౌరస్తా వద్దకు చర్లపల్లి గ్రామానికి చెందిన యువకులు బైకు రవి యాదవ్ నడుపుతున్న స్కూటీని వేగంగా ఢీకొట్టింది. దీంతో రవి యాదవ్ అక్కడికక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. ఘటన స్థలం వద్ద ఉన్న సైనికులు తీవ్రంగా గాయపడ్డ రవి యాదవు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే రవి యాదవ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న చర్లపల్లి గ్రామానికి చెందిన శివ యాదవ్, సన్నీ యాదవ్, స్వల్ప గాయాలు అయ్యాయి. మృతుడు రవి యాదవ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడని, పండగ పూట బంధువులను స్నేహితులకు పెట్టడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పట్టణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడు రవి యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ యాదవ్ సహోదరుడు కావడంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.