నిమజ్జనంలో విషాదం..
ట్యాంక్ బండ్‌పై బైక్ ఢీకొని ఎస్సై మృతి
ట్యాంక్ బండ్‌పై బైక్ ఢీకొని ఎస్సై మృతి
సెప్టెంబర్ 23, 2026
హైదరాబాద్ :
వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందడం
పోలీస్ శాఖను విషాదంలో ముంచేసింది.
2026 సెప్టెంబర్ 23న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై వెంకట గణేష్ నిమజ్జనం డ్యూటీలో హైదరాబాద్ వచ్చారు. ఎస్సై ట్యాంక్ బండ్ వద్ద విధులకు హాజరయ్యారు.
ప్రమాదం ఎలా జరిగింది?
బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గస్తీ విధుల్లో ఉండగా బైక్ ఢీకొట్టడంతో ఎస్సై వెంకట గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు, సిబ్బంది స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఎస్సై వెంకట గణేష్ మృతి చెందారు.
ఎస్సై వెంకట గణేష్ మృతి
నిమజ్జనం డ్యూటీలో విషాద ఘటన
దీంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. వెంకట గణేష్ మృతికి పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.
JCL News TV
నిజం ఆగదు .. తప్పు దాగదు
Tags
Hyderabad
