గద్వాల రాజకీయంలో కట్టప్ప ఎవరు

 



గద్వాల నియోజకవర్గంలో త్వరలో రాజకీయ సునామీ…!?

ఓ ప్రధాన పార్టీలోకి వెళ్ళాలన్న కొందరి నాయకులకు నో ఎంట్రీ…

ఎటు వైపు వెళ్లాలో ఏమీ చేయాలో తెలియక తికమక పడుతున్న ఆ నాయకులు…

ఒక విశ్లేషకుడు చెప్పినట్టు గద్వాల నియోజకవర్గంలో కృష్ణ తత్వం నడుస్తుందా అంటే అవును అనే సమాధానం ఇస్తున్నారు గద్వాల నియోజకవర్గ ప్రజలు…

అధికార పార్టీలో ఉంది కూడా ఏమీ చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోయిన కొందరు నేతలు…


స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న ఇంకొందరి నాయకుల పరిస్థితి ఎన్నికలు ఇప్పట్లో రావనే భావన వారిని మరింత ఇబ్బందికి గురిచేస్తుంది…


నియోజకవర్గంలో కలిసి ఒక నాయకున్ని పడగొడుదామానుకున్న ఆ ముగ్గురి నేతల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యింది…


కొందరు పార్టీలకు అంటి ముట్టంట్టుగా మరికొందరు నాయకులు అవకాశం వస్తే గోడలు దూకేందుకు గోడమీది పిల్లుల్లా ఎదురుచూస్తున్నారని చర్చ గద్వాల నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది…


వీటన్నికి ఈనెల 27 టైం గ్లిచ్ కానుందా అంటే అవుననే సమాధానం గద్వాల నియోజకవర్గంలో వినిపిస్తోంది…


ఏది ఏమైనా గద్వాల నియోజకవర్గ నాయకులు అభివృద్ధి కోసం పాటుపడాలే తప్ప తమ అధికార దాహం కోసం కాదని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు…


ఈరోజు మంత్రి పొంగులేటి గద్వాల పర్యటనలో అభివృద్ధి అంశాలపై కాకుండా ఒకరిపై ఒకరి బలాబలాలు చూపించేందుకు కొందరు మరికొందరు నాయకులు గద్వాల నియోజకవర్గంలో నిప్పులో ఉప్పేసి మంటలు రగిలిస్తుంటే మరొక నాయకుడు ప్రోటోకాల్ రగడ కాకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని ఎంపీ మల్లు రవి ని ఉద్దేశించి మండిపడుతున్నారు గద్వాల నియోజకవర్గ ప్రజలు…

Previous Post Next Post

نموذج الاتصال