Sarpanch Elections:ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో

 

Sarpanch Elections:

.. ఇలాంటి 14 హామీలతో సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే.. మరోవైపు ఆశావాహులు కూడా సిద్ధమవుతున్నారు. అర్ధ, అంగ బలంతోపాటు ఎన్నికల్లో ఇచ్చే హామీలపై కూడా ఆశావాహులు క్లారిటీగా ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకున్నా.. కొందరు అప్పుడే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ చెందిన కొడారి లత మల్లేష్ కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కొడారి లత మల్లేష్ .. గ్రామంలో దసరా, దీపావళి శుభకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాను సర్పంచ్ గా గెలిపిస్తే ఏ పనులు చేస్తానో తెలియజేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామ పంచాయితీలో గ్రామ ప్రజలందరికీ త్రాగునీరు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తామని, కులాలకు అతీతంగా దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫ్రీజర్ బాక్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5000 ఆర్థిక సహాయం ఇస్తామంటూ పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ ఆడపడుచుల కోసం 30 కుట్టుమిషన్ల ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, గ్రామంలో బస్తీ దావాఖాన, గ్రంథాలయం ఏర్పాటు వంటి 14 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చు పారదర్శక పాలన అందిస్తానని కొడారి లత మల్లేష్ చెబుతున్నారు.

Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!

Online

  1. TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

వేంకటేశ

  1. వేంకటేశ్వర స్వామి భజన పాటల లిరిక్స్ l God Venkateshwara Swamy Bhajana Patala Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me