వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ *

 


*



వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాబోయే ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలను కాపాడటానికి భాగంగా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ సదస్సును జిల్లా ఎస్పీ  డి. జానకి, ఐపీఎస్  .

ఈ సందర్భంగా రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్ పరిధిలో వారితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ , గతంలో చేసిన తప్పులను తిరిగి చేయకూడదని, ఇకపై మంచి ప్రవర్తనతో ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా, చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

అలాగే, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశం అని  పోలీసులు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఎవరైనా శాంతిని భంగపరిచే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ప్రజల సహకారం అవసరం

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, కార్యక్రమాలు కనిపించినా తక్షణం పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా జిల్లా ఎస్పీ  ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణం కొనసాగించగలమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య పాల్గొన్నారు.


Previous Post Next Post

نموذج الاتصال