సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) కూర్మగూడలో టెన్షన్ (Tension ) నెలకొంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి (Ammavari) ఆలయంలోకి ప్రవేశించి విగ్రహం (Statue) ధ్వంసం చేశారు. విషయం పసిగట్టిన స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు.. నిందితుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టం చేశారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారని.. విగ్రహం ధ్వసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. దోషులు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి డిమాండ్ చేశారు.