*
భూత్పూర్: ఒక వ్యక్తి నుంచి రూ. 4000 లంచం
తీసుకుంటూ భూత్పూర్ ఆరా ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డారు. వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ కార్యాలయంలో లంచాలు వసూలు చేసుకుంటూ పనులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కళ్యాణ లక్ష్మి విషయంలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఆధారాలతో ఏసీబీ అధికారులకు సమాచారం పంపారు. దీంతో వ్యూహాత్మకంగా అధికారులు దాడులు చేసి మండల ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తి నుంచి రూ.4000 ఆరిఓ బాలసుబ్రమణ్యం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
mahabubnagar