*
మిడ్జిల్ :
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం 167 వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొనడం తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మిడ్జిల్ మండల పరిధిలోని వాడ్యాల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన గోవింద చారి 60 తన వృత్తిరీత్యా పెళ్లిళ్ల పేరయ్యగా ఎల్ఐసి ఏజెంట్ గా వ్యవహరిస్తుండేవాడని ఈ క్రమంలోనే ఆదివారం తన పనుల నిమిత్తం జడ్చర్ల వెళ్లి తన సొంత గ్రామమైన బోయినపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు ఈ క్రమంలోని వాడ్యాల్ గ్రామ శివారులో గల 167 వ జాతీయ రహదారిపై టర్నింగ్ లో ఆగి ఉన్న లారీని వెనుక నుండి గోవింద చారి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొన్నది. దీంతో గోవింద్ చారి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానిక పద్ధతి ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాధిపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కాగా మృతుడు గోవింద్ చారి ఉమ్మడి మండల వ్యాప్తంగా పెళ్లిళ్ల పేరయ్యగా ఎల్ఐసి ఏజెంట్గా సుపరిచితుడు కావడంతో మండలంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.