అయ్యవారిపల్లి విద్యార్థినికి జిల్లా మొదటి బహుమతి*

jayyapal jvs media
1 minute read

 *అయ్యవారిపల్లి విద్యార్థినికి జిల్లా మొదటి బహుమతి*



మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి పాఠశాల విద్యార్థిని బి.అఖిల ప్రథమ బహుమతి సాధించింది. 


ఈ మేరకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9 వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛదనం -పచ్చదనం' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. 



ఈ నెల 5 న పాఠశాల స్థాయిలో ప్రథమస్థానం సాధించిన విద్యార్థులకు ఈ నెల 7న మండల స్థాయి పోటీలను నిర్వహించారు. మిడ్జిల్ మండల స్థాయి పోటీలలో ఉపన్యాసంలో జడ్పీహెచ్చెస్ అయ్యవారి పల్లి విద్యార్థిని ప్రవళిక మొదటిస్థానం సాధించింది. అలాగే వ్యాసరచనలో కూడా జడ్పీహెచ్చెస్ అయ్యవారిపల్లి విద్యార్థిని బి.అఖిల మొదటి స్థానాన్ని సాధించింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో వ్యాసరచన విభాగంలో జడ్పీహెచ్చెస్ అయ్యవారిపల్లి విద్యార్థిని బి.అఖిల ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పాఠశాల విద్యార్థిని బి.అఖిల జిల్లా ప్రథమ బహుమతిని సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సుధాకర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లక్ష్మమ్మ, ఉపాధ్యాయులు అనంతరెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, నిర్మల, నరసింహస్వామి, ప్రాణేశ్ రావు, అబ్దుల్లా,చక్రవర్తుల రమణాచార్యులు విద్యార్థినిని అభినందించారు. మండలం లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు .

Tags
Chat