*
జడ్చర్ల మండలం ఉద్దండాపురం గ్రామంలో మెస్త్రీ సోమయ్య ఇంట్లో గురువారం పునాది దగ్గర ఒక పాము కనిపించింది. అప్రమత్తమైన ఆయన వెంటనే సర్పరక్షకుడు డా. సదాశివయ్య కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న సదాశివయ్య తన శిష్యులు రాహుల్, చంద్రశేఖర్ లతో అక్కడికి చేరుకుని ఆ పామును పట్టుకోగా అదే రంద్రం లో నుండి మరో పాము రావటం గమనించారు. కొంచెం తవ్వి చూడగా ఒకేచోట 6 పాములున్నాయి. వాటిని చాకచక్యంగా సంరక్షించారు.
ఈ విషయం గురించి డా. సదాశివయ్య మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువ శాతం నీరు బహిరంగ ప్రదేశాల్లోని రంద్రాలలోకి పోవటం వల్ల పాములు బయటకి వచ్చి మానవ నివాస ప్రాంతాల్లో ఉంటాయన్నారు.
ఆ ఇంట్లో పట్టుకున్న పాములను శాస్త్రీయంగా *అంఫియస్మా స్టోలేటమ్* అంటారని ఇవి విష రహిత సర్పాలని తెలిపారు. ప్రజలు పాములు కనపడినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా తమకు తెలియజేయాలని సూచించారు. ఈ రకం పాములు గుంపులు గుంపులుగా ఉండటం సహజమని అన్నారు.
అన్ని పాములను పట్టుకోవటంతో సోమయ్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.