CM Revanth Reddy: అమెరికా పర్యటన చివరి రోజూ సీఎం రేవంత్ బిజీ.. ప్రవాసులతో కీలక మీటింగ్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ కాలిఫోర్నియాలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కాలిఫోర్నియాలోని ఫోర్ సీజన్ హాటల్లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ కాలిఫోర్నియాలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కాలిఫోర్నియాలోని ఫోర్ సీజన్ హాటల్లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని గూగుల్ క్యాంపస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత తిరిగి ఫోర్ సీజన్ హోటల్‌కి చేరుకున్నారు. లంచ్ తర్వాత వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్‌రెడ్డి వన్ టు వన్ కొనసాగించారు.
కాలిఫోర్నియాలోని కౌన్సిలేట్ జనరల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పలువురు తెలుగువారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇక రాత్రి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు, స్థానికుంగా ఉన్న ఇంపార్ట్‌టెంట్ గెస్ట్‌లు , సీజీఐ మెంబర్స్ పాల్గొన్నారు.