మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రం ప్రతిరోజు ఏదో ఒక భూ వివాదానికి తెర లేపుతుంది.
ఇప్పుడు తాలూకా క్లబ్ రోడ్డు నుంచి జాతీయ రహదారికి వెళ్లే దారిలో నిర్మించిన సామూహిక సంక్షేమ వసతిగృహం పక్కలో గల సర్వేనెంబర్ 18 భూమి వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది.
కానీ ఈ భూమి మాది అంటే మాది అని జడ్చర్ల పట్టణంలో గొడవలు రేగాయి.
జడ్చర్లకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వసుంధర కన్స్ట్రక్షన్స్ పేరుమీద ఎప్పుడో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించారని ఆ వెంచర్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఈ సర్వే నెంబర్ లోని వెంచర్ చేసాము దీంట్లో ఫ్లాట్లు ఉన్నాయి అంటూ బుకాయిస్తున్నారని హైకోర్టులో ఆ భూమి తరఫున పోరాడుతున్న బాధితులు మీడియా ముందు తమ గోడు తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది.
పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందిన జడ్చర్లలో భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో భూభకాసురులు ఎక్కడ కాలి కనిపించిన అది మా భూమి అంటూ దొంగ డాక్యుమెంట్లతో చాలా మందిని వేధిస్తున్నారు.
ఇది తప్పు అని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు పాలకుల చెప్పుచేతల్లో ఉండడంతో బాధితుల పరిస్థితి ముందు నువ్వు వెనక గొయ్యిల తయారయింది.
Tags
News@jcl.