మహబూబ్ నగర్: పేదలకు మరింత మెరుగైన స్థాయిలో న్యాయ సేవలు అందించేందుకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం హైకోర్టు సెంట్రల్ హాల్ నుండి రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ నవీన్ రావు తో కలిసి వర్చువల్ పద్ధతిలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ను ప్రారంభించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వర్చువల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎస్ ప్రేమావతి తోపాటు, జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పి నరసింహ, ఒకటవ అదనపు సెషన్స్ జడ్జి బి శ్రీనివాసులు, ఫ్యామిలీ కోర్టు జడ్జి పి నీరజ, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఎక్సైజ్ కోర్టు జడ్జి శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రభుత్వం న్యాయవాది మనోహర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్ధన్ లు పాల్గొన్నారు. వర్చువల్ ప్రారంభోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ కౌన్సిల్ ద్వారా న్యాయ సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జిల్లా జడ్జి ఎస్ ప్రేమావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రవికుమార్ యాదవ్, ఉమామహేశ్వరి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రఘుపతి, యోగేశ్వర్, రాజేష్, మల్లారెడ్డి, ప్యార లీగల్ వాలంటీర్ పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా మెరుగైన న్యాయ సేవలు -హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్.
byjayyapal jvs media
-
0