నిండు ప్రాణాన్ని బలికొన్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం



సైకిల్ తొక్కుతూ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు తగలడంతో బాలుడి మృతి


కంచె ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్న వీడని నిర్లక్ష్యం


 జడ్చర్ల మున్సిపాలిటీలో ఘటన

, జడ్చర్ల : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. సైకిల్



తొక్కుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కి తగిలి విద్యుత్ షాక్ తో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం.. జడ్చర్ల మున్సిపాలిటీలోని మూడో వార్డులో గల సరస్వతి నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్క రాఘవేందర్ ఇద్దరు కుమారులు సైకిల్ పై సరదాగా సైకిల్ తొక్కుతూ వెళ్తున్న క్రమంలో సైకిల్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు పార్కు పక్కనే రోడ్డు మీద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో శ్రేయాన్స్ అనే (10)బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గమనించిన కాలనీవాసులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో అప్పటికే శ్రేయాన్స్ మృతి చెంది ఉండడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే బాలుడు ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్ కు గురి కావడంతో కాలనీవాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో కాలనీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

#Jclnewstv: కాగా ఎన్నో రోజులుగా విద్యుత్ వైర్లు తేలి ప్రమాదకరంగా మారాయని, పలుమార్లు జంతువులు మూగ జీవాలు కూడా విద్యుత్ షాక్ కారణంగా చనిపోయాయని, సంబంధిత విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకపోయిందని, దీంతో స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు తెలిపారు. కాగా ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటుకు తానే డబ్బులు సమకూరుస్తానని కంచె ఏర్పాటుకు పనులు చేయాల్సిందిగా విద్యుత్ అధికారులకు మృతుడి తండ్రి అయిన బొక్క రాఘవేందర్ అనేక మార్లు కోరిన కూడా విద్యుత్ అధికారులు స్పందించలేదని, తన మాట విని విద్యుత్ అధికారులు కంచె ఏర్పాటుకు ముందుకు వచ్చి ఉంటే నేడు తన కుమారుడు తమకు దక్కేవాడని తండ్రి బొక్క రాఘవేందర్ కాలనీవాసులతో చెబుతూ బోరున విలపించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నేడు షాక్ కు గురై బాలుడు మృతి చెందాడని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 #Jclnewstv: బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి


జడ్చర్ల మున్సిపాలిటీలోని సరస్వతి నగర్ కాలనీలో నివాసముండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్క రాఘవేందర్ సింగ్ కుమారుడు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డి బాధిత ఇంటికి వెళ్లి శ్రీకాంత్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి బొక్క రాఘవేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే బాలుడు విద్యుత్ ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని అన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని మరి ఎక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడిగల్ యాదయ్య, కౌన్సిలర్ సతీష్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, సందకిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రనిల్ చందర్ రామ్మోహన్, శ్రీకాంత్, ఇంతియాజ్, రఘుపతి, రెడ్డి తదితరులు ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال