Jadcherla: రైతుపై అడవి పంది దాడి.. ఉదండాపూర్‌లో రైతు కు తీవ్రంగా గాయాలు

 

రైతుపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు

పేగులు బయటపడ్డ స్థితిలో ఆసుపత్రికి తరలింపు.. గ్రామంలో భయాందోళన

జడ్చర్ల మండలం, ఉదండాపూర్:
జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో రైతుపై అడవి పంది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలానికి వెళ్లి పని చేసుకుంటుండగా, ఒక్కసారిగా అడవి పంది అతనిపై దాడి చేసింది. ఆ దాడిలో రైతు రామకృష్ణ శరీరాన్ని తీవ్రంగా గాయపరచడంతో పేగులు బయటపడేంతగా గాయాలు అయ్యాయి.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రైతులు ఈ ఘటనను గమనించి వెంటనే రామకృష్ణ
టుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని రామకృష్ణను చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, రైతును గాయపరిచిన అడవి పంది ఇంకా సమీపంలోని చెట్లపొదల్లోనే ఉండడంతో పరిసర ప్రాంతాల రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అడవి పందిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.న్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow