తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేపట్టిన సంతకాల సేకరణకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ కార్యక్రమం:
అనిరుధ్ రెడ్డి సీఎంకు రాసిన ఈ లేఖలో రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక-ఆర్థిక ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఇప్ప చెట్లను నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ లేఖ ద్వారా కోరారు. రాష్ట్రంలో అనుకూల కలిగిన ప్రాంతాలలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్ప చెట్లు కరువును తట్టుకోగలవని తెలంగాణ వంటి అర్ధ-శుష్క ప్రాంతాలకు ఇవి ఎంతో అనుకూలమైనవి పేర్కొన్నారు. ఇవి నేల సారవంతాన్ని పెంచడమే కాకుండా, భూక్షయాన్ని అరికట్టి పచ్చదనాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. ఇప్ప పువ్వులు, గింజలు ఆదాయానికి మంచి వనరులని, గిరిజనులు, గ్రామీణ ప్రజలు వీటిని ఆహారం, ఔషధాలు, జీవనోపాధి కోసం సాంప్రదాయకంగా వినియోగిస్తారుని తెలిపారు. పోషకాలు సమృద్ధిగా ఉండి ఔషధ గుణాలు స్థానిక ఆరోగ్య సంరక్షణకు ఎంతో మేలు చేసే ఈ ఇప్ప పువ్వు చెట్లను విరివిగా పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.