అగ్నివీర్ సెలెక్షన్‌లో జడ్చర్ల హవా! 🚨 6 మంది ఒకేసారి సెలెక్ట్

 

📰 బ్రేకింగ్ న్యూస్ 

అగ్నివీర్ పరీక్షల్లో 6 మంది విద్యార్థుల ఎంపిక

జడ్చర్ల కళాశాలకు గర్వకారణమైన విజయం

అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు

ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచిన ఘన విజయం

అగ్నివీర్ ఎంపికల్లో బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సత్తా

జడ్చర్లలో ఆరుగురు విద్యార్థుల ఘన విజయం – కళాశాలకు గర్వకారణం.

జడ్చర్ల: స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A) విద్యార్థులు ఇటీవల నిర్వహించిన అగ్నివీర్ నియామక పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం కళాశాల వర్గాల్లో ఆనందోత్సాహాన్ని నింపింది.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలం, గురునాథ్, దామోదర్, సంతోష్, గణేశ్ మరియు ఈశ్వర్ అగ్నివీర్‌ ఎంపిక కావడం కళాశాల ప్రతిష్టను మరింత పెంచిందని అన్నారు.

ఈ విజయంతో కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా రాణించగల సామర్థ్యాన్ని నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా విద్యార్థులు ఇదే తరహా ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు, NCC అధికారి డాక్టర్ రాజేశ్వరి, ప్లేస్‌మెంట్ అధికారి రాఘవేంద్ర రెడ్డి, అధ్యాపకులు సదాశివయ్య, సులేమాన్, మాధురి, ప్రవీణ్, పుష్పలత, సతీష్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow