విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది కార్మికులను ముంచెత్తిన వేడి ద్రవ ఉక్కు! 8 మంది సజీవ దహనం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. సీసీడీ విభాగంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
వైజాగ్, జూన్ 8: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం (జూన్ 8) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలుకాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతుంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో భారీ మొత్తంలో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగాయి. CCD ( కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్) విభాగంలో భారీగా మంటలు చాల రేగుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఉద్యోగులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు లాడెల్ నుంచి ద్రవ ఉక్కు బయటకు వచ్చి నేలపాలైంది.
భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి భారీ క్రేన్ దగ్ధమైంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతుంది. ప్రమాద స్థలంలో మొత్తం 16 మంది వరకు ఉన్నట్లు సమాచారం. CCD విభాగంలోనే 8 మంది ఉన్నారు. SMS 1లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ద్రవ ఉక్కు మీద పడటంతో మంటల్లో చిక్కుకున్న కార్మికులంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ఈ ప్రమాదం జరిగింది. పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో మరికొందరు ఉన్నట్లు అనుమానం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
