Weather Report: రైతన్నలకు పండగే.. తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. ఇక వర్షాలే వర్షాలు..
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి ప్రవేశించాయి. సరిగ్గా మృగశిర కార్తె రోజునే (జూన్ 8, 2026 నాటికి) నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
రాబోయే మూడు రోజులు వర్షాలు
ఆదివారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి, ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణ పరిస్థితులు
తూర్పు ఉత్తర ప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా.. ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడిన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. భారత ప్రాంతంలో సుమారుగా 15° ఉత్తర అక్షాంశం వెంబడి ఉన్న గాలుల కోత (Wind Shear), ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. నుండి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండకపోవచ్చని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
ఆదివారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి, ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది
