ఫీల్డ్ అసిస్టెంట్ కేతావత్ రాజేష్ వ్యవసాయ పొలంలో నల్ల బెల్లం


 



నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కేతావత్ రాజేష్‌కు చెందిన వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని అచ్చంపేట ఎక్సైజ్ ఎస్సై సతీష్ బృందంతో పాటు జిల్లా ప్రత్యేక బృందం సీఐ రాజ్యలక్ష్మి వారి సిబ్బందితో తనిఖీలు చేసి పట్టుకున్నారు.


అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కేతావత్ రాజేష్‌కు చెందిన వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని అచ్చంపేట ఎక్సైజ్ ఎస్సై సతీష్ బృందంతో పాటు జిల్లా ప్రత్యేక బృందం సీఐ రాజ్యలక్ష్మి వారి సిబ్బందితో తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ విషయంపై ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని వ్యవసాయ పొలంలో నల్లబెల్లం డంపింగ్ చేశారని పక్కా సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో వ్యవసాయ పొలంలో 25 బస్తాల నల్ల బెల్లం ఏడున్నర క్వింటాళ్లు ఉంటుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు గ్రామంలో గుసగుసలు వినబడుతున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow