Mahabubnagar Road Accident: స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి


 

Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్‌ బైక్‌ యూటర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

యువకుల నిర్లక్ష్యపు బైక్ రేసింగ్ సరదా ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాను విషాదంలో ముంచెత్తింది.
పాలకొండ బైపాస్ రోడ్డుపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు.
ఈ ఘటనతో మహబూబ్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డుపై రాత్రివేళల్లో జరుగుతున్న బైక్ రేసింగ్‌లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బైపాస్‌ను బైక్ రేసర్ల అడ్డాగా మార్చేశారని ఆరోపిస్తున్నారు.
“ప్రతి రోజు రాత్రి స్పోర్ట్స్ బైక్‌లతో యువకులు బైపాస్‌పై రేసింగ్‌లు చేస్తుంటారు… చెవులు పగిలేలా శబ్దాలు చేస్తూ ప్రాణాలతో ఆటలాడుతుంటారు… పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్, స్పీడ్ గన్స్, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి బైక్ రేసింగ్‌లను పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు. లేదంటే మరిన్ని అమాయక కుటుంబాలు రోడ్లపై బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్‌ బైక్‌ యూటర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow