👉 జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.
📌 ముఖ్య డిమాండ్లు:
✅ రాజాపూర్, ఊర్కొండ మండలాలలో తాసిల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు
✅ జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నూతన భవనం
✅ కావేరమ్మపేటలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం 2000 గజాల స్థలం కేటాయింపు
🏛️ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటికి వినతిపత్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, “జడ్చర్లకు అన్ని అర్హతలు ఉన్నాయి… ప్రజల చిరకాల కోరిక ఇదే” అని తెలిపారు.
🤝 ఈ అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
Tags
Jadcherla
