సజ్జనార్ తో సహా 21 మంది IPSలు బదిలీ

తెలంగాణలో భారీ ఐపీఎస్‌ల బదిలీలు
21 మంది పోలీస్ అధికారులకు స్థానచలనం!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ బదిలీల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ఉన్నారు.
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్
ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనకు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ను ప్రభుత్వం నియమించింది.
మహిళా భద్రత బాధ్యతలు సౌమ్య మిశ్రాకు
జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్య మిశ్రాకు డీజీపీ ఉమెన్ అండ్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా బాధ్యతలు అప్పగించింది. డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ అదనపు బాధ్యతలను కూడా ఆమెకే ఇచ్చింది.
జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా
స్వాతి లక్రాకు జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు అప్పగించారు. చారు సిన్హాను అవినీతి నిరోధక శాఖ (ACB) డీజీగా నియమించారు. సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు కూడా చారు సిన్హాకే అప్పగించారు.
ఇతర కీలక నియామకాలు
అనిల్ కుమార్: తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం.
విక్రమ్ సింగ్ మాన్: గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా బాధ్యతలు.
వై. నాగిరెడ్డి: సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు.
ఎం. స్టీఫెన్ రవీంద్ర: హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ.
ఆకున్ సబర్వాల్: తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీపీగా నియామకం.
కార్తికేయ: మల్టీ జోన్-1 ఐజీగా నియామకం.
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి: ఏసీబీ డైరెక్టర్‌గా నియామకం.
డి. జోయల్ డేవిస్: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియామకం.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow