హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి.. బ్యాడ్జీలు అందించిన ఎస్పీ జానకి!

 

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి.. బ్యాడ్జీలు అందించిన ఎస్పీ జానకి!



పోలీస్ సిబ్బంది జీవితాల్లో పదోన్నతులు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి – జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ వారి ఛాంబర్‌లో పదోన్నతి చిహ్నాలను అందజేసి అభినందించారు.

డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ 1540 విజయ్ కుమార్ ఏఎస్ఐగా పదోన్నతి పొంది వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం.ఏ. రషీద్ (HC 1613) ఏఎస్ఐగా పదోన్నతి పొంది నారాయణపేట జిల్లాకు బదిలీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పదోన్నతి అనేది కేవలం హోదాలో మార్పు మాత్రమే కాదని, మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తూ పదోన్నతులు పొందడం అభినందనీయమన్నారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, బదిలీ అయిన జిల్లాల్లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని, పోలీస్ శాఖకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం పదోన్నతి పొందిన ఇద్దరు ఏఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్ పోలీస్ సేవలు విజయవంతంగా సాగాలని ఎస్పీ ఆకాంక్షించారు.

JCL News TV – నిజం ఆగదు.. తప్పు దాగదు!

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow