హైదరాబాద్-శ్రీశైలం హైవే 'ఎలివేటెడ్ కారిడార్'.. 30 అడుగుల ఎత్తులో నిర్మాణం, త్వరగా శ్రీశైలం చేరుకోవచ్చు..! తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. 62.5 కి.మీ మేర హైవే విస్తరణ చేపట్టనుండగా.. కృష్ణా నదిపై నాలుగు వరుసలతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే శ్రీశైలానికి దూరాభారం తగ్గనుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకల…