కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఆర్టీసీ సమ్మెకు (RTC Strike) కౌంట్‌డౌన్ (Countdown) మొదలైంది. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ జేఏసీ నేతలు (RTC JAC Leaders) తెలిపారు. సమ్మెలో 40వేల మంది కార్మికులు పాల్గొంటారన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి మూడు నెలలు అవుతున్నా.. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 21 ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లతో 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటించింది.