నాగర్ కర్నూలు జిల్లా....* *టన్నెల్ ప్రమాదం..*

 *


 *రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది:*

👉 *ఎస్పీ*

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో ప్రమాదం జరిగింది..ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్. ఐదుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారాయన. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి బయల్దేరినట్టుగా తెలిసింది.


TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me