100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?
సాధారణంగా రోబోలు, పెద్ద పెద్ద మిషన్లు, కోట్లు జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఉండే ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీలో.. ఏకంగా వంద గొర్రెలకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్ల తయారీ ప్లాంట్‌లో గొర్రెలకు డ్యూటీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం.. అసలు ఈ జర్మన్ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ చేసిన ఆ ప్రయోగం ఏంటి? దానివల్ల కంపెనీకి ఏంటీ లాభం..? అనే విషయాలు తెలుసుకుందాం..
పర్యావరణ పరిరక్షణ: యంత్రాల వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.
జీవవైవిధ్యం: సహజ సిద్ధమైన పద్ధతిలో గడ్డి నియంత్రణ జరిగి జీవవైవిధ్యం పెరుగుతుంది.
కంపెనీ డైరెక్టర్ ఏమన్నారంటే..?
“ఈ ఫార్మ్ కేవలం గ్రీన్ ఎలక్ట్రిసిటీని ఇవ్వడమే కాదు.. జీవవైవిధ్యం, స్థానిక వ్యవసాయం, శాస్త్రీయ పరిశోధనలను కూడా ప్రోత్సహిస్తోంది. ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో సామరస్యంగా ఎలా పనిచేయాలో ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది’’ అని ఫోక్స్‌వ్యాగన్ డైరెక్టర్ మార్జెనా పిలిచ్ గ్రోన్స్కా అన్నారు.
కేవలం గడ్డి కోయడమే కాదు.. అంతకుమించి..
ఈ ప్రయోగాన్ని కేవలం గడ్డి కోయడానికే పరిమితం చేయకుండా ఫోక్స్‌వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలతో చేతులు కలిపింది. సోలార్ ప్యానెళ్ల నీడ గొర్రెలకు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగిస్తుందా? ఈ విధానం వల్ల నేల నాణ్యత, స్థానిక సూక్ష్మ వాతావరణం, జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలపై శాస్త్రవేత్తలు సమగ్ర పరిశోధనలు చేస్తున్నారు.
కొత్త వాతావరణానికి అలవాటుపడిన గొర్రెలు
ఈ గొర్రెల మంద యజమాని జస్టినా నోవాక్ గజెక్ మాట్లాడుతూ.. గొర్రెలు సోలార్ ప్లాంట్ వాతావరణానికి చాలా త్వరగా అలవాటుపడ్డాయని తెలిపారు. ప్యానెళ్ల మధ్య చిన్న చిన్న గుంపులుగా విడిపోయి అవి చాలా ప్రశాంతంగా గడ్డి మేస్తున్నాయని, ఈ వాతావరణంలో అవి సురక్షితంగా భావిస్తున్నాయని తెలిపారు. పారిశ్రామిక రంగానికి, ప్రకృతికి మధ్య సమతుల్యతను కాపాడేలా ఫోక్స్‌వ్యాగన్ చేపట్టిన ఈ ఈకో ఫ్రెండ్లీ ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.