మరికొన్ని గంటల్లో చికెన్ షాపులు బంద్.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా దొరకదా..?

Chicken News

చికెన్ సెంటర్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్స్‌లో కూడా చికెన్ ఐటమ్స్ దొరకవేమోనని కంగారు పడుతున్నారు. పోనీ.. చికెన్ దొరక్కపోతే మటన్ తిందాంలే అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. మటన్ రేట్లు మంటెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికెన్ ప్రియులు నిరాశలో ఉన్నారు.

అసలు ఈ చికెన్ షాప్స్ మూసేయాలనే నిర్ణయానికి రావడం వెనుక కారణాలు ఏమిటంటే.. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని ఓనర్స్ చెబుతున్నారు. గతంలో కిలోకు రూ.30-35 వరకు మిగిలేదని, ఇప్పుడు రూ.5-6 మాత్రమే మిగులుతోందని అంటున్నారు.

ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడం వల్ల పౌల్ట్రీ కంపెనీలు కూడా రేట్లు పెంచాల్సి వస్తోందని చెబుతున్నాయి. దీంతో షాప్ ఓనర్స్, కంపెనీల మధ్య లెక్క సరిపోక చికెన్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చింది.

చికెన్ షాప్ ఓనర్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్న ‘మార్జిన్’ అంటే ఏమిటి?

‘మార్జిన్’ అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం. కొనుగోలు ధర, అమ్మకపు ధర మధ్య తేడా కాకుండా అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది.

ఉదాహరణకు.. లైవ్ చికెన్ కిలో రూ.120కి కొంటే, కట్ చేసిన తర్వాత 700-750 గ్రాములే వస్తుంది. దీంతో కిలో ధర రూ.150-160 అవుతుంది. కస్టమర్‌కు రూ.200కి అమ్మినా, అది పూర్తిగా లాభం కాదు.

రెంట్, కూలీల జీతాలు, కరెంట్, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ తీసేస్తే కిలోకి రూ.5-6 మాత్రమే మిగులుతోందని ఓనర్స్ చెబుతున్నారు. హైదరాబాద్‌లో 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులు ఉన్నాయి. ఈ బిజినెస్‌పై లక్షల మంది ఆధారపడి ఉన్నారు. షాపులు మూతపడితే తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow