మహబూబ్‌నగర్‌లోని సరస్వతి శిశు మందిర్ హైస్కూల్ విద్యార్థులకు జెసిఎల్ న్యూస్ టీవీ ఆధ్వర్యంలో 200 నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. పూజ్యశ్రీ పిట్టల జనార్దన్ గురుస్వామి ఆదేశాల మేరకు, జెసిఎల్ న్యూస్ జయపాల్ తన వంతు సహాయంగా ఈ నోటు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా జయపాల్ మాట్లాడుతూ, "కర్మాగారాలు వస్తువులను తయారుచేసి దేశాభివృద్ధికి దోహదపడినట్లే, సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు మరియు సమాజం పట్ల బాధ్యతలను నేర్పిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. నా యూట్యూబ్ ఛానల్ నాలుగేళ్ల కృషి ఫలితంగా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విద్యార్థుల కోసం వినియోగించడం ఎంతో ఆనందంగా ఉంది" అని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని కృపతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా jai shbharisha భక్త బృంద వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల జనార్దన్ గురుస్వామి, భద్రయ్య గురుస్వామి హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమాన్ని జెసిఎల్ న్యూస్ జయపాల్ నిర్వహించారు.