మద్దూర్ PHCలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం | 45 నిమిషాల యోగ సాధన

మద్దూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం



మద్దూర్ టౌన్, జూన్ 21 
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

నేచర్ క్యూర్ వైద్యురాలు డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం (మెడిటేషన్) నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ, యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి తగ్గి జీవన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగను భాగంగా చేసుకోవాలని సూచించారు.

అనంతరం యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సిబ్బందికి వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగ సాధన శరీరానికి, మనసుకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow