తీవ్ర విషాదం.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు మృతి!



బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ల హోం గ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజ సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు.


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీవీ9 కన్నడ రిపోర్ట్ చేసింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ల హోం గ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజ సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ టీమ్‌ మొత్తం ఈ రోజు మధ్యాహ్నాం బెంగళూరుకు చేరకుంది. తమ అభిమాన ఆటగాళ్లు, టీమ్‌ ట్రోఫీతో వస్తుంటే చూసి.. వారి అభినందించేందుకు స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 17 సీజన్లుగా కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ.. ఫైనల్‌గా 18వ సీజన్లో తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీ సాధించడంతో ఈ రోజు బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ముందు విధాన సౌధకు చేరుకొని.. అక్కడ సీఎంను కలిసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలి అనుకున్నారు. కానీ, పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో విధాన సౌధ నుంచి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకోనున్నారు. అయితే ఆటగాళ్లు విధాన సౌధాకు వస్తున్నారనే విషయం తెలిసిందే. అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Previous Post Next Post

نموذج الاتصال