డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 గురికి జైలు శిక్ష


 మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఆరుగురు వాహనదారులు పట్టబడినట్టు ట్రాఫిక్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు చోట్ల ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. 5 గురు ఆటో డ్రైవర్లు, 1 ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేసి సెకెండ్ క్లాస్ కోర్టు లో హాజరు పరచగా న్యాయమూర్తి ఆర్.శశిధర్ 5 గురు ఆటో డ్రైవర్లకు రెండు రోజుల జైలు శిక్ష,1 ద్విచక్ర వాహనదారుడికి వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ వలన ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లు మద్యం మత్తు లో ఆటోలు నడపడం అత్యంత బాధ్యతారహితమని, ఇటువంటి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow