Air Crash: ఇప్పటి వరకు జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు వీళ్లే…

 


గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు ప్రణాలు కోల్పోయారు. అయితే వీరిలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఈయన 2016 ఆగస్టు 7 నుండి 2021 సెప్టెంబరుగు 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 8 మంది రాజకీయ నేతలు మరణించినట్టు తెలుస్తోంది.

గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ బిడ్జింగ్‌ను ఢీకొటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో సహా సుమారు 241 మంది ప్రయాణికులు మరణించగా కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈయన 2016 ఆగస్టు 7 నుండి 2021 సెప్టెంబరుగు 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఇలా 1965 నుంచి ఇప్పటి వరకు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో 8 మంది రాజకీయ నేతలు మరణించినట్టు తెలుస్తోంది. ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన వారి వివరాలు చూసుకుంటే..

బల్వంత్రాయ్ మెహతా (1965)

మొదటగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజకీయ నేత నాటి గుజరాత్‌ రెండవ సీఎం బల్వంత్రాయ్ మెహతా. 1965 యుద్ధ సమయంలో మెహతా భారత్‌-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో ఉండగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఓ జెట్ పొరపాటున మెహతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహతా ప్రాణాలు కోల్పోయారు.


గుర్నామ్ సింగ్ (1973)

విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతల్లో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్‌ కూడా ఒకరు. ఈయన 1973న మే 31న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 25 ఫిబ్రవరి 1899 జన్మించిన ఈయన పంజాబ్‌కు 6వ ముఖ్యమంత్రి పనిచేశారు. 8 మార్చి 1967 నుండి 25 నవంబర్ 1967 వరకు, మళ్ళీ 17 ఫిబ్రవరి 1969 నుండి 27 మార్చి 1970 వరకు సీఎంగా పనిచేశారు. 

సంజయ్ గాంధీ (1980)

విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతల్లో మరో వ్యక్తి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ. ఈయన 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈయన జెట్‌లో ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా నియంత్రణ కోల్పోయిన విమానం ఢిల్లీలోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లో కూలిపోయింది.ఈ ప్రమాదంలో సంజయ్‌ గాంధీతో పాటు మరో ప్రయాణీకుడు కెప్టెన్ సుభాష్ సక్సేనా కూడా మరణించాడు.


మాధవ్‌రావు సింధియా (2001)

విమాన ప్రమాదంలో మరణించిన మరో రాజకీయ నేత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి, మాధవరావు సింధియా. ఈయన కూడా భారత రాజకీయ నాయకుల్లో ప్రముఖడు. ఈయన 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో మరణించారు. ఓ ర్యాలీలో పాల్గొనడానికి విమానంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు.


జిఎంసి బాలయోగి (2002)

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజకీయ నాయకుల్లో మరో వ్యక్తి నాటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి. ఈయన 2002 మార్చి 3న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో ఉండగానే సాకేంతిక సమస్య కారణంగా ప్రమాదానికి గురైంది. 1 అక్టోబర్ 1951 జన్మించిన ఈయన 12 స్పీకర్‌గా పనిచేశారు.


ఓపీ జిందాల్ (2005)

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మరో రాజకీయ నేత నాటి హర్యానా విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న ఓపీ జిందాల్. ఈయన 2005 మార్చి 31న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 1930 ఆగస్టు 7 జన్మించిన ఆయన హర్యానా ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా పనిచేశారు.


వైఎస్ రాజశేఖర రెడ్డి (2009)

హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతల్లో మరో వ్యక్తి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయన 2009 సెప్టెంబర్ 2 నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 1949 జూలై 8 జన్మించిన ఈయన 2004, 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ వెళ్తుండగా వాతావరణం అనకూలించక ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు హెలికాప్టర్ ఉన్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు.


దోర్జీ ఖండు (2011)

హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ నాయకుల్లో మరో వ్యక్తి నాటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు. ఈయన 2011 ఏప్రిల్ 30న చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 19 మార్చి 1955లో జన్మించిన ఈయన రెండు సార్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Previous Post Next Post

نموذج الاتصال