ఒక్కరోజే ఆరుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య!


 

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనీ.. ఒక్కరోజే ఆరుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య!

రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మిడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఆరుగురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో తాము ఫెయిలయ్యామన్న మనస్తాపంతో.. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మిడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఆరుగురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో తాము ఫెయిలయ్యామన్న మనస్తాపంతో మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు బలవన్మరణాని కి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్‌ ఫెయిలైందనీ..

హయత్‌ నగర్‌, తట్టి అన్నారం, వైయస్సార్‌ కాలనీకి చెందిన అరుంధతి (17) ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ బైపీసీ చదువుతుంది. నిన్న విడుదలైన పరీక్ష ఫలితాల్లో బొటనీ సబ్జెక్టులో అరుంధతి ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన విద్యార్థిని మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని దారుణానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నాగోల్‌ లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి సోదరుడు గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కెమిస్ట్రీలో ఫెయిలైనందుకు బంజారాహిల్స్‌లో మరొకరు..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఓ సబ్జెక్ట్‌ ఫెయిల్‌ అయినందుకు తీవ్ర మనస్థాపానికి గురైన బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లోని ఇందిరానగర్‌ లో నివాసం ఉంటున్న సుమతి, రామకృష్ణల కూతురు నిష్ఠ (16).. కెమిస్ట్రీలో ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి వరకూ కళ్లముందే ఉన్న తమ కూతురు విగతజీవిగా మారడంతో రామకృష్ణ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.

బల్కంపేటలో ఇంకొకరు..

సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అవంతినగర్‌ తోటలో నివాసముంటున్న ప్రైవేట్‌ ఉద్యోగి సత్యనారాయణ కుమారుడు ప్రశాంత్‌ (17) బల్కంపేటలోని 9 ఎడ్యుకేషన్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిలైనట్టు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్‌ (జీడీనగర్‌) గ్రామానికి చెందిన సాపల్ల ఎల్లయ్య, గంగమ్మ దంపతుల కుమార్తె శశిరేఖ (17) అనే విద్యార్ధిని, భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన రాసాల మల్లేశ్, సునీత దంపతుల చిన్నకుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ (17) అనే మరో విద్యార్ధి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క పరీక్ష మాత్రమే జీవితం అనుకుని అర్ధాంతరంగా ప్రాణాలొదిలారు ఈ యువకిరణాలు. ఫెయిల్‌ అయితే మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. చదువే ఇష్టం లేకపోతే నచ్చినపని చేస్తూ బతకొచ్చు. అంతేగానీ లేనిపోని భయాలతో ఇలా ప్రాణాలొదిలి మీపైనే ప్రాణాలు పెట్టుకున్న కన్నోళ్లకు కడుపుకోత మిగల్చడం న్యాయం కాదు. ఓసారి ఆలోచించండి..

Previous Post Next Post

Education

  1. TG DOST తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...! - New!

News

  1. TG SSC Results 2025 : నేడు తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి - New!

نموذج الاتصال