*
జడ్చర్ల మాచర్ల వద్ద కారు బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్నటువంటి తాతా మనుమడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనలో మరణించినటువంటి మహబూబ్ నగర్ న్యూ ప్రేమ్ నగర్ కు చెందిన
1) సామ మీ దయ అర్జిత్ రెడ్డి (తున్ను) (22 Years)
2) మాదిరెడ్డి వెంకటరెడ్డి (69)
ల యొక్క కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో, పెద్ద మనసుతో, వారు ఇంకొక నలుగురికి కంటి చూపు అందించాలని కండ్లు (కార్నియా) దానం చేయడం జరిగింది.
లయన్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి గారి సహాయంతో, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ యొక్క టెక్నీషియన్ అయినా శివను పిలిపించి కంటి శుక్లాలు (రెటీనా) సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా లయన్ నటరాజు మాట్లాడుతూ నేత్ర దానం చేసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
అనంతరం కుటుంబ సభ్యులకు కార్నియా సేకరించినట్లు టెక్నిషియన్ శివ ధృవ పత్రాలను అందజేశారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ పట్టణం లో 225 మంది నుంచి రెటీనా ను సేకరించినట్లు తెలిపారు. మరణానంతరం ఇతరులకు కంటి చూపును ఇచ్చిన వారమవుతామని అన్నారు.
నేత్ర దానం చేసేందుకు 9666900900కు సంప్రదించాలని కోరారు.