Telangana Police: పాకిస్తానీలు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి.. తెలంగాణ డీజీపీ ఆదేశాలు

 

Telangana Police: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. సాధారణ వీసాలు ఉన్న వారు ఏప్రిల్ 27వ తేదీ లోగా ఇండియా వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు దేశం వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక, తెలంగాణ పోలీసులు శాఖ కూడా వీసాల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఉంటున్న పాకిస్తానీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో .. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాల్సిందే. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు.

Previous Post Next Post

Education

  1. TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...? - New!
  2. TGSRJC : టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి - New!

نموذج الاتصال