రోడ్డు ప్రమాదంలో ధర్మపురం కు చెందిన వెంకటేష్, జడ్చర్ల ప్రాంతానికి చెందిన రవికుమార్ ఇద్దరు దుర్మరణం

 రోడ్డు   ప్రమాదంలో    ఇద్దరు  దుర్మరణం



వనపర్తి   మండలం  నాగవరం  తండా-   రాజపేట  మధ్య కారు .  సైకిల్ మోటర్  ఢీ. కొన్న   ప్రమాదంలో   ఇద్దరు యువకులు.  అక్కడి  కక్కడే   మరణించారు.  సుమారు నాలుగున్నర   గంటల.  ప్రాంతంలో  ఈ  సంఘటన జరిగిందని   వనపర్తి  రూరల్  ఎస్సై  జలంధర్ రెడ్డి తెలిపారు.   మహబూబ్నగర్  జిల్లా  ధర్మపురం  కు  చెందిన వెంకటేష్,   జడ్చర్ల   ప్రాంతానికి   చెందిన   రవికుమార్ వనపర్తి   నుంచి   సైకిల్ మోటార్  పై  కొత్తకోట  వెళుతుండ గా   కొత్తకోట   వైపు  నుంచి  వస్తున్న  కారు  మార్గ మధ్యంలో   సైకిల్  మోటార్లు  ఢీ  కొట్టింది.   సైకిల్   మోటార్  పై  ఉన్న  ఇద్దరు   అక్కడి  కక్కడే  మరణించారు. మృతదేహాలను  వనపర్తి   ఆసుపత్రికి   తరలించారు. వనపర్తి   సిఐ  నాగభూషణరావు  సంఘటన  స్థలాన్ని కి వెళ్లి  పరిస్థితిని   పరిశీలించారు.


*వనపర్తి రోడ్డు ప్రమాదంలో ఆలూరు యువకుడు మృతి* పండగలవేల విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం ఆలూరు గ్రామానికి రవీందర్, మహబూబ్నగర్ చెందిన వెంకటయ్యలు స్నేహితులు. రవీందర్ గద్వాల్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రవీందర్ తండ్రి నారాయణ ముదిరాజ్ స్వచ్ఛంద విరమణ పొంది గత సంవత్సరమే తన ఉద్యోగానికి కుమారుడిని ఎంపికయ్యేలా చేశారు. రవీందర్ కు తల్లిదండ్రులతో పాటు భార్య అనిత, ముగ్గురు చిన్నారులు వున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారంనాడు సెలవు దినం ఉండడంతో రవీందర్ తన స్నేహితుడైన వెంకటయ్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని జడ్చర్లకు వస్తుండగా మారుతి ఎర్టిగా కార్ రూపంలో వనపర్తి మండల పరిధిలోని రాజాపేట నాగవరం తండాల మధ్యలో మృత్యువు ముంచుకొచ్చుందని ప్రత్యక్షసాక్షులు బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుని స్వగ్రామమైన జడ్చర్ల మండలం ఆలూరులో విషాదచాయలు అలుముకున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me