, జడ్చర్ల: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పోలీస్
ఎస్కార్డును తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఎక్కడికి వెళ్లినా పోలీసు
వాహనాలు ఎస్కార్ట్గా వస్తున్నాయని.. సామాన్య ప్రజలకు పోలీసులు
సేవలు ఎంతో అవసరం ఉందని.. తన వాహనం ముందు ఎస్కార్ట్
పోలీసులు కేటాయించే సమయాన్ని ప్రజల సమస్యలు
పరిష్కరించడంలో శాంతిభద్రతలు కల్పించడంలో వినియోగించాలని
కోరారు. పోలీస్ డిపార్ట్మెంట్లో డిమాండ్కు తగ్గ సిబ్బంది లేనందున నా
కోసం పోలీసులను, ఎస్కార్ట్ వాహనాలు వాడొద్దని కోరుతూ
మంగళవారం జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఫార్మాట్లో అనిరుద్ రెడ్డి లేఖ
రాశారు. ఈ విషయం జడ్చర్ల నియోజకవర్గంతో పాటు జిల్లా
వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా జడ్చర్ల నియోజకవర్గం
ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో
పోస్టులు పెడుతున్నారు. కాగా ఎమ్మెల్యే నిర్ణయంపై జిల్లా ఎస్పీ
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీకి లెటర్ రాశారు.
నియోజకవర్గంలో నేనెక్కడికి వెళ్లిన పోలీసు వాహనాలు ఎస్కార్ట్ గా వస్తున్నాయని.
సామాన్య ప్రజలకు పోలీసుల అవసరం ఎంతో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో తగినంత మంది లేరు కావున నాకోసం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులను ఎస్కార్ట్ వాహనాలను వాడు ధోని విన్నవించారు.
ఈ నిర్ణయాన్ని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు
స్వాగతించా
రు.
Tags
News@jcl