ఇక సెలవు వీడ్కోలు పలుకుతూ.. కన్నీరు పెట్టుకున్న అమితాబ్ ఎమోషనల్ వీడియో
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రియాలిటీ షోలో హోస్ట్‌గా వ్యవరిస్తూ పలు సీజన్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ షో 14 సీజన్లు పూర్తి చేసుకుని 15 వ సీజన్ ప్రసారమైంది. అయితే డిసెంబర్ 29న ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా అందులో అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. ‘‘ లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేము వీడ్కోలు పలుకుతున్నాము. ఈ వేదిక రేపటి నుంచి కనిపించదు.
అలాగే మేము కూడా ఇక్కడ కనిపించను అని చెప్పాలనిపించడం లేదు. నేను అమితాబ్ బచ్చన్ ఈ సీజన్‌లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఈ ఎపిసోడ్‌కు వచ్చిన అభిమానులు కూడా ఆయనతో పాటు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే దేవుడిని చూడలేదు. కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూశాము అంటూ మహిళలు చెప్పడంతో ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా మారింది. కాగా దీనికి చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది