
ఏపీ ఎన్నికల నేపధ్యంలో మెగా(Mega), అల్లు(Allu) ఫ్యామిలీల మధ్య గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున కాకుండా తన స్నేహితుడి తరపున ప్రచారం చేశారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పు బట్టాయి. పవన్ కళ్యాణ్ కి కాకుండా వేరే పార్టీ వాళ్లకి ఎలా సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ నాగ బాబు చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పరాయివల్ల కోసం పనిచేసే మావాడైన పరాయివాడే.. మాకోసం మరిచేసే పరాయివాడైనా మావాడే.. అంటూ రాసుకొచ్చాడు నాగబాబు.
"I have deleted my tweet"
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024
నాగబాబు చేసిన ఈ ఒక్క పోస్ట్ తో మెగా, అల్లు కుటుంబాల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. సోషల్ మీడియాలో రెండు ఫ్యామిలీలపై ఓ రేంజ్ లో ట్రోల్స్ నడిచాయి. ఈ క్రమంలోనే తన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టీవేట్ చేశాడు నాగబాబు. అక్కడితో ఈ గొడవ సద్దుమణింగింది అనుకున్నారు అంతా. తాజాగా.. మళ్ళీ ట్విట్టర్ లో రీఎంట్రీ ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు.. ఎంట్రీతోనే మరో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో.. నేను నా ట్వీట్‌ను డిలీట్ చేశాను.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఇక్కడితో అయినా ఈ వివాదం ఆగుతుంది లేదా అనేది చూడాలి మరి.
from V6 Velugu https://ift.tt/PYM42NA
via IFTTT