హైదరాబాద్: బాచుపల్లి (Bachupally) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో జరిగిన భారీ మోసం (Fraud) వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జ్యువెలర్స్ (Chetan Jewelers) పేరిట కూకట్‌పల్లి, ప్రగతి నగర్‌లో నితీష్ జైన్ (Nitish Jain) అనే వ్యక్తి బంగారం వ్యాపారం (Jewelry Shop) చేస్తున్నాడు.. అతని వద్దకు వచ్చే కస్టమర్ల (Customers) నుంచి సుమారు రూ.10 కోట్ల (Rs. 10 Crores) విలువ చేసే బంగారం, ఆభరణాలతో పరారయ్యాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి నితీష్ జైన్ షాపు తెరవకపోవడంతో జనాలకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నితీష్ జైన్ స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకు వచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు దగ్గరయ్యాడు. ఈ విధంగా తన నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. నితీష్ జైన్‌కు నగల దుకాణాదారులు భారీ మొత్తంలో బంగారం ఇచ్చారు. ఇప్పుడు అతని ఆచూకీ తెలియక లబోదిబో మంటున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీలకు ఇస్తుండే వాడని, స్కీంలు సయితం పెట్టి అందరినీ నితీష్ జైన్ ఆకట్టుకున్నాడని బాధితులు తెలిపారు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించాడు.
Tags
Telangana