2025: తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాలు విడుదల తేదీ ఇదే!

jayyapal jvs media
1 minute read


 లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరున విడుదల కానున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఏప్రిల్‌ 25వ తేదీన ఇంటర్ ఫలితాలను బోర్డు విడుదల చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 24వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తుంది. అలాగే ఈ సారి ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్‌ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌ ద్వారా కూడా ఫలితాలు నేరుగా పంపించేందుకు ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది.

TG Inter Result Date and Time 2025: తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాలు విడుదల తేదీ ఇదే! ఈసారి వాట్సాప్‌కే నేరుగా రిజల్ట్స్‌

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తికాగ.. మార్కులను డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరో వారంలోనే పూర్తి చేసి.. ఒకవేళ ఇప్పుడు అందుబాటులోకి రాకపోయినా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నాటికల్లా కచ్చితంగా సిద్ధం చేస్తామని బోర్డు అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని, ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)లో క్రోడీకరణ జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజులు పడుతుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఒకరోజు అటుఇటుగా ఏప్రిల్ నెల నాలుగో వారంలో ఫలితాలు ఖచ్చితంగా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. జూన్‌ 1వ తేదీ వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. అనంతరం కాస్త ముందుగానే అంటే జూన్‌ 2వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. ఇక రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. త్వరలోనే పదో తరగతి ఫలితాలు కూడా విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది.


Chat