పగల్గామ్ దాడి ఘటనతో యావత్ భారతం కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీళ్లకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇప్పుడందరిపైనా ఉంది. దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం అన్న రెగ్యులర్ మాటకు విరుద్ధంగా ఫుల్‌ఫోర్స్‌తో కదులుతోంది భారత బలగం. ఉగ్రవాదం అంతు తేలాలి.. లెక్కకు లెక్క పక్కాగా అప్పచెప్పాలి.. మరోసారి భారత్‌వైపు చూడాలంటే గజ్జున వణికిపోవాలన్న రేంజ్‌లో దూసుకుపోతోంది ఇండియన్ ఆర్మీ. BSF, CRPFతో కలిసి కసిగా అడుగులు వేస్తోంది. ఇక వేట మొదలైంది.. ఆ రాత రాసిన భగవంతుడొచ్చినా ఆపలేడు అన్నట్లుగా ఉగ్రవాదుల ఏరివేత షురూ చేసింది. కశ్మీర్‌లో స్థానికులు ఒకప్పటిలా లేరు. గతకొన్నాళ్ల నుంచి మార్పు గట్టిగానే మొదలైంది. మొన్నటి పహల్గామ్ దాడితో కశ్మీరుల గుండె రగిలిపోతోంది. ప్రశాంతగా ఉంటే కశ్మీర్‌పై ఉగ్రవాదులు తుపాకీ ఎక్కుపెట్టడంతో కడుపు మండిపోతోంది. దీంతో ఉగ్రవాదుల గురించి సమాచారాన్ని రహస్యంగా భారత్‌కు అందజేస్తున్నారు. ఊహాచిత్రాలను సైతం విడుదల చేయడంతో లోకల్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇక లోకల్స్ సపోర్ట్‌తో ఇంటింటా జల్లెడ పడుతున్నారు సైనికులు. ఎన్‌కౌంటర్లతోనూ విరుచుకుపడుతున్నారు. బందిపొరా ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతమార్చారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని ఐఈడీ బాంబులతో పేల్చేశారు. మరో టెర్రరిస్టు ఆదిల్ నివాసాన్ని కూడా కూల్చిపడేశారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసినా అంతుచూస్తున్నారు. కశ్మీర్ చూట్టూ నిత్యం పహారా కాస్తూ.. బూట్ల సౌండ్లతోనే బెంబేలెత్తిస్తున్నారు. పూల్వామా, పూంచ్, రాజౌరి సెక్టార్స్‌లో తనిఖీలు చూస్తుంటే బోర్డర్‌లో ఉన్న పాక్ సైనికులు సగం చచ్చిపోవాల్సిందే. కేవలం కశ్మీర్‌లో మాత్రమే కాదు.. పంజాబ్ బోర్డర్‌లో శత్రుదేశానికి సైతం చమటలు పట్టేలా బలగాలు మోహరించాయి. అంతేకాదు…రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని చేధించి పలువురిని అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, రాకెట్ లాంచర్, ఐఈడీలు, హ్యాండ్ గ్రెనేడ్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేశారు.
మొత్తంగా.. భారత్ వైపు చూడడం అటుంచితే కనీసం బోర్డర్‌వైపు లుక్కేయాలన్నా జాయింట్లు జారిపోయేలా సీరియస్ యాక్షన్ షురూ అయ్యింది. అనుమానం వచ్చినా అంతుచూస్తుండటంతో.. పాక్‌కు చలిజ్వరం పట్టుకున్నట్లైంది.