బిడ్డను మూడో ఫ్లోర్‌ కిటికీలోంచి బయటకు విసిరేసిన తల్లి..!

 Viral Video: హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. బిడ్డను మూడో ఫ్లోర్‌ కిటికీలోంచి బయటకు విసిరేసిన తల్లి..!


ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసి పడటంతో జనాలు హడలెత్తిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు మరణించగా.. పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ తల్లి తన బిడ్డను ఎలాగైనా కాపాడాలన్న ఆరాటంలో మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది..

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ఒక హోటల్‌లో గురువారం (మే 1) ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసి పడటంతో జనాలు హడలెత్తిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు మరణించగా.. పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ తల్లి తన బిడ్డను ఎలాగైనా కాపాడాలన్న ఆరాటంలో మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నాజ్‌ హోటల్‌లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే హోటల్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. హోటల్లో బసకు దిగిన వారిలో పలువురు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీ నుంచి కిందకు దూకేశారు.

క్రమంలో ఓ మహిళ తన బిడ్డను మూడో అంతస్తులోని కిటికీలోంచి బయటకు విసిరేసింది. అక్కడున్న వారు చిన్నారిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే మూడో అంతస్తు నుంచి కిందకు విసరడంతో బిడ్డకు స్వల్పగాయాలయ్యాయి. అనంతరం ఆమె కూడా అలానే దూకేందుకు ప్రయత్నించగా మంటల ధాటికి సాధ్యపడలేదు. దీంతో ఆమె మంటల్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సంఘటన జరిగిన సమయంలో 18 మంది హోటల్‌లో ఉన్నారు. వీరు ఢిల్లీ నుంచి తీర్థయాత్ర కోసం అజ్మీర్‌కు వచ్చారు.

Previous Post Next Post

نموذج الاتصال