జిల్లా పోలీసు కార్యాలయం – మహబూబ్ నగర్
జిల్లా పోలీస్ాధికారి D. జానకి, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, వేసవి సెలవుల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను అరికట్టే ఉద్దేశంతో మహబూబ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిపారు.
ఈ సందర్భంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన కేసులలో, వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. సురక్షిత రహదారి ప్రయాణం గురించి అవగాహన కల్పించడమే కాకుండా, ప్రతి తల్లిదండ్రుడికి రూ.1500 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మాట్లాడుతూ:
"వాహనాల నడపడం అనేది పూర్తిగా బాధ్యతతో కూడిన చర్య. మైనర్లు వాహనాలు నడపడం వల్ల వారు మాత్రమే కాదు, ఇతర ప్రయాణికుల ప్రాణాలకూ ప్రమాదం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరు కూడా మినహాయింపు కాకుండా చర్యలు తీసుకుంటాము."